జిల్లా స్థాయి కవితా పోటీల్లో స్టూడెంట్స్ ప్రతిభ

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూరు బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన 'నేను-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..నా బాల్యం' కవితా పోటీల్లో బాల్కొండ మండల స్టూడెంట్స్  ప్రతిభ చూపి జిల్లా ఉత్తమ కవితా పురస్కారాలు అందుకున్నారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టాపూర్ కు చెందిన టెన్త్ విద్యార్థిని అల్గోట్ భావన, వన్నెల్(బి)కి చెందిన ఆర్. 

రశ్విత, పి.నవిజ ప్రశంసా పురస్కారాలను జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థినులను హెచ్ఎం శ్రీనివాస్, గైడ్ టీచర్ వివేకావర్ధన్, ఉపాధ్యాయులు సురేందర్, అరుణ్, బోజన్న అభినందించారు.