Under ground village: భూమిలో ఊరు .. రత్నాలకు నిలయం.... ఎక్కడ ఉందో తెలుసా..

ఈ విశ్వంలో ప్రాణికోటి ఆవాసానికి కరెక్ట్ ప్లేస్ ఒక్క భూగ్రహం మాత్రమే. ఎన్విరాన్​ మెంట్ తో పాటు తిండికి, గూడుకి అనుకూలంగా ఉంటుంది. అర్బనైజేషన్ అవసరాలకు అనుగుణంగా ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద బిల్డింగులు వెలుస్తున్నాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ఊరు మాత్రం విచిత్రంగా భూమిలో సెటిల్ అయ్యింది. అలాగని అదేం మోడ్రన్ కల్చర్​ కి  దూరంగా ఉంటున్న ఊరు కాదు. టెక్నాలజీని ఉపయోగించుకునే ఆ ఊరి జనాలు.. ఇప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు కారణాలేంటో చూద్దాం...

ఆస్ట్రేలియాలో ఆడిలైడ్​ సిటీకి 900కిలోమీటర్ల దూరంలో సువార్డ్ హైవేకి దగ్గరగా ఉంటుంది. కూబర్ పెడీ అనే చిన్న టౌన్. ఎడారిలో ఉండే ఈ ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంటుంది. దాదాపు 60 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పుల కుంపటిగా రగిలిపోతుంటుంది. ఆస్ట్రేలియాలో వానలు తక్కువగా పడే చోటు. చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి జనాలు భూగర్భంలో ఇళ్లు కట్టుకున్నారు. 

ALSO READ | ఆధ్యాత్మికం: ఆనందంగా జీవించాలంటే ఎలా బతకాలో తెలుసా..

భూగర్భంలోని తేమ కారణంగా వీళ్లకు ఏసీల అవసరం కూడా ఉండదు. విశేషం ఏంటంటే.. ప్రపంచంలో ఇలా అండర్ గ్రౌండ్​ లో  ఏర్పడిన ఏకైక పట్టణం ఇదే. ఇక్కడ సుమారు. రెండు వేల మంది జనాభా ఉంటుంది. భూగర్భంలో ఇల్లు కాన్సెప్ట్​  ఇష్టం లేని వాళ్లు కొద్ది దూరంలో రెగ్యులర్ గా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లు మాత్రమే కాదు, స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హో టల్స్, చర్చ్, స్విమ్మింగ్ ఫూల్స్ అన్నీ అందర్ గ్రౌండ్లోనే ఉంటాయి.

రంగు రాళ్ల ఊరు

ఈ ఊరిని అండర్ గ్రౌండ్​ లో  నిర్మించడానికి కారణం రంగు రాళ్లు. ఈ ప్రాంతంలో విలువైన రంగు రాళ్లు దొరుకుతాయి. దీనిని ముందుగా గుర్తించింది 14 ఏళ్ల విల్లీ హచిన్సన్ అనే. కుర్రాడు. న్యూ కొలరాడోకి చెందిన విల్లీ  తండ్రి జిమ్ హచిన్సన్ ఒక సైంటిస్టు. ఆయన 1915లో ఈ ప్రాంతంలో నీటి పరిశోధన కోసం ఒక టీంతో ఇక్కడికి వచ్చారు. కొడుకు విల్లీని కూడా తనతో పాటు సరదాగా తీసుకొచ్చాడు. ఒకరోజు ఎక్సపర్​మెంట్ సైట్ లో ఆడుకుంటుండగా విల్లీకి మెరుస్తున్న ఒక పెద్ద రాయి దొరికింది. దాన్ని వాళ్ల నాన్నకు ఇచ్చాడు. అది చాలా విలువైన రంగు రాయి అని జిమ్ కిఅర్థమయ్యింది. దీంతో నీటి పరిశోధనని పక్కన పెట్టేసి.. రంగు దాళ్ల తవ్వకాలు మొదలు పెట్టించాడు. అప్పటి నుంచి ఈ ప్లేస్ ప్రపంచానికి విలువైన రాళ్లను అందందే ప్రాంతంగా మారింది. 

1916 నుంచి ఓవల్ గనుల తవ్వకాలు ఎక్కువయ్యాయి. ఈ రంగు రాళ్లు మల్టీకలర్ లో ఉండేవి. అంతేకాదు క్వాలిటీలో కూడా బెస్ట్ గా ఉండి... నెక్లెస్స్ తయారీకి అనుగుణంగా ఉండటంతో వ్యాపారుల కన్ను ఈ నగరంపై పడింది. రాళ్లకి విపరీతంగా గిరాకీ వచ్చింది. 1999 నాటి కల్లా ఆ ప్రదేశమంతా పెద్ద పెద్ద గుంతలుగా మారిపోయింది. దాదాపు 45 అడుగుల లోతున్న గోతులు మిగిలాయి. అప్పటికే అధిక ఉష్ణోగ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలు ఈ గోతులనే ఇళ్లుగామార్చేసుకున్నారు. అలా కూబర్ పెడీ టౌన్ వెలిసింది. కువ పిటి' అనే రెండు పదా నుంచి ఏర్పడిన పేరే కూలర్ పెడీ. దీనికి వైట్ మ్యాన్స్ హోల్స్, వాటర్ హోల్స్ అనే అర్దాలున్నాయి.  

రిపీట్​గా రినోవేషన్లు..!

కూబర్ పెడీలో రంగు రాళ్లు తవ్వుకోవడానికి అనుమతి అంత ఈజీగా ఇవ్వరు. ఒకవేళ తవ్వకాలు చేపట్టాలనుకుంటే మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని.. లీజు ప్రకారం తవ్వుకోవచ్చు. అది కూడా టౌన్​కి దూరంగా చేపట్టాలి. అయితే మైనింగ్.. యాక్ట్​లోని లూప్ హోల్స్ ని ఇక్కడి జనాలు వాడుకున్నంతంగా మరెవరూ వాడుకోలేరేమో! ఎందుకంటే డగౌట్స్​ లో రంగు రాళ్లు దొరికితే అవి ఆ ఇంటి యజమానికే సొంతం. దీంతో ఉన్న ఇంట్లోనే రినోవేషన్లు చేపట్టేవాళ్లు చాలా మంది. ఆక్రమంలో మట్టిని తవ్వుతున్నప్పుడల్లా వాళ్లకు రంగు రాళ్లు దొరికేవి.

ఆ తర్వాత కొన్నాళ్లపాటు మరీ దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎక్కడైనా మైనింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడంతో జనాలు చెలరేగిపోయారు. రంగు రాళ్ల కోసం ఇతరుల సైట్లలో కూడా దాడులు చేశారు. పైగా ఎక్స్ ప్లోజీవ్ స్టిక్స్ సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరికేవి. దీంతో దాడుల కేసులు ఎక్కువయ్యాయి. ఈ తరహా కేసులు ఎక్కువైపోతుండటంతో ప్రభుత్వం ఆ రూల్స్​ను మార్చేసింది. ఇళ్లను మైనింగ్ నుంచి వేరు చేసింది. సూపర్ మార్కెట్లో పేలుడు  సామాగ్రి అమ్మకాన్ని బ్యాన్ చేసింది. కేవలం మైనింగ్ ఏరియాలో మాత్రమే రంగు రాళ్ల తవ్వకానికి అనుమతి ఇచ్చింది. కాదని ఇళ్లలో తవ్వకాలు చేపడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.

సకల సదుపాయాలు 

కూబర్ షెడీలో వందకు తొంభైమంది  అండర్ గ్రౌండ్ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ ఇళ్లను నగౌట్స్ అని పిలుస్తారు. నేల నుంచి గుంతల్లోకి ఇళ్లలోకి దిగడానికి మెట్లు ఉంటాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి రోడ్లు, వాటిని కనెక్ట్ చేస్తూ గల్లీలు ఉంటాయి. ప్రతిఇంటికీ కరెంట్​ ఉంది. కేబుల్..  ఫోన్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసింది గవర్నమెంట్.   వారానికి ఒకరోజు సంత ఉంటుంది. పొరుగు ఊరినుంచి కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం తీసుకొస్తారు వ్యాపారులు. ఆరోజే అందరూ బయటకి వచ్చి వారానికి సరిపడా సామాన్లు తీసుకెళ్తారు. మోటరిస్టుల కోసం మోటల్స్ (హోటల్స్ తరహాలో బెడ్స్, రూమ్స్ ఉండవు.హైవేలపై కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఉంటాయి) వెలిశాయ్.

ALSO READ | Chandrayaan-3: చంద్రుడిపై ఇంత పెద్ద బిలముందా..? ప్రజ్ఞాన్ రోవర్ బయటపెట్టేసింది..!

ఈ టౌన్లో ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. డగౌల్స్ ఉన్న ఏరియాల్లో జాగ్రత్తగా నడవాలి. లేకుంటే గుంతల్లో పడిపోవచ్చు. బాంబులు పేలతాయనే హెచ్చరికలతో బోర్డులు అక్కడక్కడ కనిపిస్తాయి. డగౌటీలో ఫైర్ యాక్సిడెంటీ జరిగితే మిగతా ఇళ్లకు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. చెత్తను కూడా నిల్వ చేయడానికి ఎక్కడపడితే అక్కడ పడేయటానికి వీల్లేదు. ఎందుకంటే జబ్బులు తొందరగా వ్యాపిస్తాయి. కాబట్టి బయట కేటాయించిన కొన్ని స్థలాల్లో చెత్తను పారేయాలి. 

2006లో ఓపెల్ డ్రీమ్' అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ద్వారానే ప్రపంచంలో ఎక్కువ మందికి ఈ ప్లేస్ గురించి తెలిసింది. జనవరి, ఫిబ్రవరి టైంలో కూలర్ పెరీలో భయంకరమైన వేడి ఉంటుంది. ఆ టైంలో బిజినెస్​ లన్నీ ఆల్​ మోస్ట్​ క్లోజ్ చేస్తారు. మే నుంచి సెప్టెంబర్ విజిట్ చేయడానికి మంచి టైం. ఈ పట్టణానికి టూరిస్టుల తాకిడి కూడా ఎక్కువగా  ఉంటుంది. 

– వెలుగు... లైఫ్.