ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం సాఫ్ట్ బాల్ జిల్లా సీనియర్ ప్రాబబుల్స్ జట్ల ఎంపిక జరిగింది. సీనియర్ సాఫ్ట్ బాల్ పురుషులు, మహిళల ప్రాబబుల్స్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ తెలిపారు.
జనవరి మొదటి వారంలో శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి రాష్ట్ర పోటీలకు పంపుతామని తెలిపారు. హెడ్మాస్టర్ లక్ష్మీ నర్సయ్య, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ లు నరేశ్, అనికేత్, సంజీవ్, మౌనిక పాల్గొన్నారు.