జర్నలిస్టు కాలనీలో 64వ వారం శ్రమదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ టౌన్​ లోని జర్నలిస్టుకాలనీలో ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 64వ వారం శ్రమదానం నిర్వహించారు. కాలనీలోని 1వ వీధిలో కమిటీ ప్రతినిధులతో కాలనీ వాసులు భాగస్వాములై శ్రమదానం చేశారు. రోడ్డుకు ఇరువైపుల పెరిగిన గడ్డి, అనవసరమైన మొక్కలను తొలగించారు.

రోడ్లపై గుంతల్లో మొరం వేసి బాగు చేశారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, కొక్కెర భూమన్న,  ఎల్​టీ కుమార్, ఎర్ర భూమయ్య,  గడ్డం శంకర్,  సాయన్న, రవి, జీవన్, గోపి, జయరాజ్, రాజు, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.