ఎక్స్‌కి పోటీగా వచ్చిన మెటా యాప్ థ్రెడ్స్.. సోషల్ మీడియాలో దానికంటూ ఒక స్థానం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్త సంవత్సరానికి ముందే మరో కొత్త ఫీచర్‌ని తీసుకురాబోతోంది థ్రెడ్స్. అదేంటంటే.. సెర్చ్ బార్లో ప్రొఫైల్స్, డేట్ రేంజ్‌లను ఫిల్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
సెర్చ్బార్లో ఇప్పుడు టాప్, రీసెంట్ అనే ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫీచర్ వస్తే.. సెర్చ్ బార్లో కుడివైపు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అవేంటంటే.. ఆఫ్టర్ డేట్(after date), బిఫోర్ డేట్(before date), ఫ్రమ్ ప్రొఫైల్(from profile). వీటి ద్వారా యూజర్లకు సెర్చింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది.