కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలలో సంబురంగా బతుకమ్మ

కామారెడ్డి,  నిజామాబాద్​ జిల్లాలలో సోమవారం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు.  గౌరమ్మకు పూజచేసి సౌభాగ్యం ప్రసాదించమని కోరారు. బతుకమ్మ లను తీరొక్క పూలతో అందంగా అలంకరించి కోలాటం ఆడారు. ఈసారి డీజేలు నిషేదించడంతో సాంప్రదాయంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడి బతుకమ్మ ఆడారు.  

బతుకమ్మ పాటలు, మహిళలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.  అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. – డిచ్​పల్లి , లింగంపేట, ​నందిపేట, కోటగిరి, నవీపేట్ వెలుగు నెట్​వర్క్​