క్యాన్సర్ కు రూ.100ల టాబ్లెట్

ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ కు అనేక దేశాల సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు చికిత్స కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.  అయితే ముంభైలోని టాటా మెమోరియల్ సెంటర్ క్యాన్సర్ తగ్గించడానికి ఓ టాబ్లెట్ తయారు చేసింది. అది క్యాన్సర్ వల్ల వచ్చే అనారోగ్య లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని సీనియర్ క్యాన్సర్ సర్జిన్ డా. రాజేంద్ర బడ్వే తెలిపారు. 

ఈ టాబ్లెట్ వాడిన తర్వాత మళ్లీ క్యాన్సర్ సోకే అవకాశాలు 50 నుంచి 30శాతం మాత్రమే అని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి ఇది కెమోటోగ్రఫీ ట్రీట్మెంట్ లాంటిదని టాటా మెమోరియల్ హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. దీని ధర కూడా రూ.100లుగా నిర్ణయించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చే అప్రూవల్ పొంది 2024 జూన్ లేదా జూలైలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.