కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూరు మండలం సిద్దరామేశ్వర నగర్ గ్రామ శివారులో 44వ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా..ఆరుగురికి తీవ్రగాయలయ్యాయి. 

గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి నిర్మల్  వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.