జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు మృతి, తండ్రి పరిస్థితి విషమం

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేశ్వరరావు పేట సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరికి తీవ్రగాయలు అయ్యాయి. మెట్ పల్లి పట్టణానికి చెందిన మహాజన్ శివరామకృష్ణ, తన కుమారుడు అక్షయ్ తో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. అక్షయ్ స్పాట్ లోనే చనిపోగా... శివరామకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మరణం, తండ్రి పరిస్థితి విషమంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.