క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని మంత్రి పొంగులేటి నివాసంలో దూపదీప నివేదన అర్చక సంఘం ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్ శర్మ మంత్రిని  శాలువాతో సత్కరించారు. 

సంఘం అధ్యక్షుడు మునగలేటి రమేశ్​ శర్మ అర్చకుల పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వీరాస్వామి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరింగంటి, భార్గవాచార్యులు, ఆయా మండలాల అర్చకులు పాల్గొన్నారు.