కొత్త ప్లాంటేషన్ కు ప్లాన్ రూపొందించాలి : పోదెం వీరయ్య

  • మేడారం అడవుల్లో చెట్లు పడిపోయిన ఏరియా పరిశీలన 

తాడ్వాయి, వెలుగు : గాలి వాన బీభత్సంతో నేలకూలిన చెట్ల స్థానంలో కొత్త ప్లాంటేషన్ చేసేందుకు ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అధికారులను ఆదేశించారు. పడిపోయిన చెట్ల నష్టంపై అంచనా వేసి నివేదికలు పంపించాలని సూచించారు.  ములుగు జిల్లా మేడారం అడవుల్లో వందలాది ఎకరాల్లో నేల కూలిన చెట్ల ప్రాంతాన్ని  బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకురావాలని సూచించారు.

 అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ను చూడగా..  ఆయనకు డీఎఫ్ఓ చైర్మన్ వివరించారు. ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. ఆయన వెంట కాళేశ్వరం జోన్  సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జావేద్, ఎఫ్ డీఓ ఎస్ రమేశ్,  ములుగు అడిషనల్ కలెక్టర్, స్థానిక ఇన్ చార్జ్  ఎఫ్ఆర్ వో కృష్ణవేణి, పస్రా రేంజ్ ఎఫ్ఆర్ఓలు బాలరాజు, మాధవి శీతల్, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.