దేశంలో రాజ్యాంగవిరుద్ద పాలన కొనసాగిస్తుండ్రు:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

  • దేశంలో మహిళలకు భద్రత లేదు
  • రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తుంది 
  • కలకత్తా ట్రైనీ డాక్టరపై ఘటన బాధాకారం 
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

మంచిర్యాల: దేశంలో రాజ్యాంగానికి  విరుద్దంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్క రించుకొని చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తుందన్నారు. పార్లమెంట్​సమావేశాల్లో సొంత ఏజెండాతో ముందుకువెళ్లడం ఇందుకు నిదర్శమన్నారు.  దేశంలో శాంతి భద్రత లు గాడితప్పాయన్నారు. దేశంలో రోజురోజుకు హత్యలు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నారని ఆరోపించారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందన్నారు.   కలకత్తా లో ట్రైనీ డాక్టర్​పై  ఘటన జరగడం దారుణమన్నారు.  దేశంలో యువత అన్ని రంగాల్లో  ముందుకు రావాలన్నారు.  యూత్​ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. కేంద్రం మహిళలపై  భద్రత మరింత పెంచాలన్నారు. దేశంలో బీజేపీ పాలనను అంతమొందించాలన్నారు.

ఇక్కడి  యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడంతో కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. అటవీశాఖ పర్మిషన్లు రాకపోవడంతో చెన్నూరు నియోజకవర్గం లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.కేంద్ర దృష్టికి తీసుకెళ్లి ఫారెస్ట్​ పరిషన్లకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని చిన్న మున్షీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.కోటపల్లి మండలం పారిపెల్లి లోని కాలభైరవ ఆలయంలో ఆయన ప్రత్యేక  పూజలు చేశారు.  కాలభైరవ స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు.