డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు స్పీడప్​ చేయాలి : ఎమ్మెల్యే విజయరమణా రావు

  • పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణా రావు 

పెద్దపల్లి, వెలుగు: డబుల్​ బెడ్​రూం ఇండ్లలో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలంలోని చందపల్లి, హనుమంతుని పేట (రాంపల్లి) శివారులలో నిర్మించిన డబల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో  వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

అయ్యప్ప స్వాములకు అన్నదానం

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి శాస్త్రి నగర్ లోని అయ్యప్ప స్వామి మండపం వద్ద అయ్యప్ప మాలధారులకు, భక్తులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో అన్నసంతర్పణ చేశారు. అయ్యప్ప నూతన సంవత్సర క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.  లైబ్రరీ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.