బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : పల్లగొర్ల మోదీ రాందేవ్​యాదవ్​

యాదాద్రి, వెలుగు : రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్​యాదవ్​ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్​ ఇచ్చిన బీసీ డిక్లరేషన్​ను గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు ముందే కులగణన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు, బీహార్​లో బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.  తెలంగాణలో కూడా అదే తరహాలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో నాయకులు బట్టు రామచంద్రయ్య, గుండెబోయిన సురేశ్, వట్టెం మధు, చిన్నం సాగర్, ఎల్లేశ్, యశ్వంత్ గౌడ్, దిరావత్ అఖిల్ నాయక్, మల్లికార్జున్, నాగరాజు, పవన్ పాల్గొన్నారు.