Lifestyle News: హగ్‌ చేసుకుంటే.. బోలెడన్ని బెనిఫిట్స్...

ఫంక్షన్​లకు వెళ్లినా... స్కూల్​ ఫ్రెండ్స్​.. కాలేజీ ఫ్రెండ్స్​.. ఇంకా బాగా తెలిసిన వారు.. బంధువులు.. ఎక్కడైనా అనుకోకుండా కనపడితే చాలు.. హగ్​ చేసుకుంటాము.. ఇక పండుగలకు .. పబ్బాలకు అయితే.. పెళ్లి .. పేరంటాలు ఇలా ఏది జరిగినా ఒకప్పుడు హగ్​( కౌగిలింత) తో పలకరించుకునేవారు.  అయితే దానిని కాస్త శృంగారంలో ఒక భాగమని మనలో ఒక పనికిరాని ఆలోచన రావడంతో .. దానిని తగ్గించేశారు.  దీని వలన చాలా ప్రయోజనాలను కోల్పోతున్నామని సైంటిస్టులు అంటున్నారు.   హగ్​కి అంత సీన్ ఉందా? అంటే ఒకసారి ఈ ఏడు లాభాలపై ఓ లుక్కేస్తే.. ఉందనే అంటారు!

చిన్నప్పుడు అమ్మ తన పిల్లల్ని హగ్​ చేసుకుంటుంది, అందుకే తల్లీబిడ్డలు అంత సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుటి కంటే, హగ్ చేసుకున్నప్పుడే ఎక్కువ సంతృప్తి, సంతోషం కలుగుతుంది. ఇదే తల్లిబిడ్డలకు, పార్ట్​ నర్స్ కు  వర్తిస్తుంది. అయితే, హగ్​ ని  శృంగార సంబంధమైనదిగా భావించడం వల్లనే మన దేశంలో హగ్ చేసుకుంటున్నవాళ్లను వింతగా చూస్తారు!

కాని  బంధువులను.. కావలసిన వారిని ఆత్మీయులను హగ్​ చేసుకుంటే   లోలోపల అంతులేని సంతోషం ఫీల్ అనేది సహజంగా మనకు తెలియకుండానే వస్తుంది. మనుషులు  హ్యూమన్ టచ్ కి దూరం అయితే  సంతోషాన్ని కోల్పోతారు. కాబట్టి కనీసం పండుగనాడన్న ఒకరినొకరు ముట్టుకోవాలని పెద్దలు అలా ఆచారం లెక్క పెట్టారేమో తెలియదు కాని ...  హగ్ వల్ల చాలా లాభాలున్నయని సైన్స్ కూడా చెస్తోంది. బయటి దేశాల్లో.. హగ్ కామన్! ప్రేమని ఎక్స్ ప్రెస్​  చేసే గ్రేట్ సింబల్. హగ్ కేవలం శృంగారానికి సంబంధించినది కాదని రియలైజ్ కావాలి. కౌగిలింతే అన్నింటికన్నా అందమైన, అద్భుతమైన కమ్యూనికేషన్ అని మనమంతా తెలుసుకోవాలి. 

హగ్​  అందమైన కమ్యూనికేషన్..  నోటి మాటగా.. ఐలవ్ యూ... ఐ లైక్ యూ  అని చాలామంది చెప్పి  వాళ్ల పీలింగ్స్ ఎదుటివాళ్లకు ఎక్స్  ప్రెస్​ చేస్తారు. మాటలతో ఎన్ని సార్లు ఐలవ్ యూ అని చెప్పినా... అది బెస్ట్ వన్  మాత్రం కాలేదని సైంటిస్టులు అంటున్నారు.  మీరు చెప్పిన మాటలో వాళ్లకు  ప్రేమ  కనపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎన్నిసార్లు  ఐ లవ్ యూ అని చెప్పినా వృథానే... మరో విధంగా  మన పీలింగ్స్ ని సైగలతోనూ ఎక్స్  ప్రెస్​  చేస్తాం. అన్నింటికన్నా చాలా ఈజీగా చేయగలిగేది. ..మనల్ని ప్రేమించేవాళ్లను.. హగ్​ చేసుకోవడమే. అది సంతోషాన్ని సంతృప్తిని, గాఢమైన ప్రేమను తెలియజేస్తుంది. ఇద్దరి మధ్య క్లోజ్ ఫిజికల్ కనెక్షన్ ని ఏర్పరుస్తుంది. ఇద్దరికీ కలిపి సంతోషాన్ని ఆరోగ్యాన్ని గిఫ్ట్ ఇస్తుంది. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, కెరీర్లో ఎదుగుదలకు హగ్స్ చాలా ముఖ్యం అంటారు. థెరపిస్ట్, రచయిత వర్జీనియా సాతిర్. హెల్దీగా. ..కంఫర్ట్ గా జీవించడానికి హగ్స్ ఎంతో ముఖ్యమని ఆమె చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతోమంది సైంటిస్టులు హగ్​ విషయంలో  ఎన్నో స్టడీలు చేశారు.  వారి పరిశీలనలో తెలిపిన వివరాల ప్రకారం..  హగ్స్  పాజిటివ్ ఎమోషన్స్​ పెంపొందిస్తాయని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎమోషనల్ పెయిన్...

మనకు తెలిసినవారు .. బంధువులు.. ఆత్మీయులు  చనిపోయినప్పుడు  అతని తరపు చుట్టాలు, ఫ్రెండ్స్ హగ్ చేసుకొని ఏడుస్తుంటారు. హగ్ బాధని తగ్గిస్తుంది.. నిరాశగా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయి  దు:ఖంలో మునిగిపోయినప్పుడు కలిగే ఎమోషనల్ పెయిన్ని హగ్​ తగ్గిస్తుంది. . ఆ బాధనుంచి బయటపడేసే శక్తి కేవలం మీ ఆత్మీయుల హగ్​ కే ఉంది. హగ్ మూడ్​ ను , మనసుని  బ్యాలెన్స్  చేయగలదు. మీరు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడు హగ్​ లు  లేకుంటే. దాని నుంచి బయటపడలేరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఓవరాల్ హెల్త్ ..

ప్రతి రోజూ హగ్ చేసుకుంటే స్ట్రెస్​ లెవల్స్ తగ్గి రోగ నిరోధక వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.  అంతేకాదు అలాంటి వారిలో  రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అంటే వాళ్లు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఈ ఆశ్చర్యకరమైన విషయాలన్నీ 2014లో లండన్​ సైంటిస్టులు చేసిన ఒక స్టడీలో తేలింది. రోగ నిరోధక శక్తి వీక్​గా ఉండటమే అన్ని రోగాలకు కారణం.దీనినిబట్టి పరిశీలిస్తే ఓవరాల్ హెల్త్ కి హగ్ ఎంతో ముఖ్యమైనదని అర్దమవుతుంది. 

స్ట్రెస్ తగ్గిస్తుంది 

మానసిక ఆరోగ్యలపై కూడా హగ్  పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. హగ్ చేసుకున్నప్పుడు కార్టిసోల్ లెవల్స్ తగ్గుతాయి. అప్పుడు  మీరు రిలాక్స్ స్టేజికి వచ్చేస్తారు. హగ్ చేసుకుంటే.. లోలోపల ఉండే భయం కూడా పారిపోతుంది.  మూడ్​ ను సెట్​ చేస్తుంది. ఒత్తిడిని ఓడించాలంటే ఒక్క హగ్​ చాలు. 

ఆత్మవిశ్వాసానికి..

అవసరం లేకున్నా.. అక్కరకు రాకున్నా కొన్ని విషయాల గురించి పదేపదే  ఆలోచిస్తూ యాంగ్జెటీలో చిక్కుకుంటారు  కొంతమంది. ఈ యాంగ్జెటీ పేషెంట్లకు కూడా హగ్ ఒక పర్​ఫెక్ట్​  ఫీల్.  హగ్ చేసుకున్న తర్వాత కచ్చితంగా యాంగ్జెటీ నుంచి బయటపడతారు. హగ్​ భయాన్ని తగ్గిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని. సైంటిస్టులు  ప్రూవ్ చేశారు.  మానవ సంబంధాల్లో టచ్ అనేది చాలా పవర్ ఫుల్ మెకానిజమ్. ఒక మనిషి మీతో ఉన్నాడని టచ్ లో ఉన్నాడని హగ్​  మాత్రమే చెప్పగలుగుతుందని ఆమ్ స్టర్ డమ్ లో ఉన్న పియూ యూనివర్సిటీ సైకలాజికల్ సైంటిస్ట్ సాదర్ కూలె  చెప్పారు. 

అందమైన కమ్యూనికేషన్

మనం సాధారణంగా ఎవరితోనైనా ఎక్కువగా మాటలతో ఫేషియల్ ఎక్సిషన్స్, సైగలతో భావాల్ని చేరవేస్తూ   కమ్యూనిటీ చేస్తాం . కాని  కొంతమంది టచ్ తో కూడా  మెసేజ్ చేరవేసుకుంటారు. ఒకరికొకరు తెలియకపోయినా.. టచ్ చేసినప్పుడు వాళ్లు అనుకుంటున్నది అవతలి వాళ్లకు చేరుతుంది. వాళ్లు అనుకుంటున్నది వీళ్లకూ చేరుతుంది. ఒక్కోటచ్​ ఒక్కో విధమైన ఎమోషన్​ ను  కన్విన్స్ చేస్తుంది. ద్వేషాన్ని, బాధని, అసహ్యాన్ని,ప్రశంసని, ఆనందాన్ని , దు:ఖాన్ని, కరుణని ఇలా అన్నింటినీ టచ్ తెలియజేస్తుంది. అయితే మన ప్రశంసని, బాధని, సంతోషాన్ని కంఫర్ట్ గా ఈజీగా ఎక్స్ ప్రెస్ చేయడానికి ఉన్న ఒకే ఒక అందమైన కమ్యూనికేషన్ హగ్ మాత్రమే!

చక్రాల యాక్టివేషన్

ఒక్క హగ్ శరీరంలో ఉండే చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది. థైమస్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఇది బాడీలో తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.. పారాసింపథిటిక్​ నెర్వస్ సిస్టమ్ సమర్థవంతంగా పని చేయడంలోనూ హగ్ హెల్ప్ చేస్తుంది. హగ్ చేసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. చర్మం నిగనిగలాడుతుంది. హగ్ చేసుకున్నప్పుడు చర్మంలో విద్యుత్ లాంటి ప్రవహిస్తుంది. దీన్నే గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటారు. స్కిన్​ కండక్షన్ తో ప్రవహించే విద్యుత్ వల్ల పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మెరుగ్గా పని చేస్తుంది. మనల్ని ఇష్టపడేవాళ్లకు, ప్రేమించేవాళ్లకు ఒక హగ్ ఇస్తే మీతోపాటు వాళ్లూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. సో. ఇప్పుడైనా  మీ స్నేహితులను.. ఆత్మీయులను, బంధువులను హగ్​ తో పలకరించండి..