బిట్​ బ్యాంక్​: ఆధునిక విద్యాభివృద్ధి

  •      సెయింట్​ జార్జి గ్రామర్​ స్కూల్​ నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసిన మొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల.
  •     సెయింట్​ జార్జి గ్రామర్​ స్కూల్​ను 1943లో స్థాపించారు. 
  •     ఆధునిక, పాశ్చాత్య విద్యావిధానం హైదరాబాద్​ రాజ్యంలో 19వ శతాబ్దం మధ్య నుంచి ప్రారంభమైంది. 
  •     ప్రతి తాలుకా, జిల్లా కేంద్రాల్లో రెండు పాఠశాలలు స్థాపించాలని నిజాం ప్రభుత్వం మొదటిసారి 1859లో నోటిఫికేషన్​ జారీ చేసింది. 
  •     సాలార్​జంగ్​ హయాంలో 1870–80 మధ్యకాలంలో గణనీయంగా విద్యాభివృద్ధి జరిగింది.
  •     సిటీ స్కూల్​, స్కూల్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ను 1870లో స్థాపించారు. 
  •     చాదర్​ఘాట్​ ఇంగ్లీష్​ స్కూల్​ను 1872లో స్థాపించారు. 
  •     స్కూల్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ను, చాదర్​ఘాట్​ ఇంగ్లీష్​ హైస్కూల్​ను హైదరాబాద్​ కాలేజీగా 1880లో మార్చారు. 
  •     హైదరాబాద్​ కాలేజీ 1887 నుంచి నిజాం కాలేజీగా వాడుకలోకి వచ్చింది. 
  •     నిజాం కాలేజీగా పిలువబడుతున్న హైదరాబాద్​ కాలేజీ మొదటి ప్రిన్సిపల్​ సరోజినీ నాయుడు తండ్రి డాక్టర్​ అఘోరనాథ్​ ఛటోపాధ్యాయ. 
  •     1882 వరకు ఏర్పాటైన మూడు ఎయిడెడ్​ ఇంగ్లీష్​ స్కూల్స్​. అవి.. 1. సెయింట్​ జార్జి గ్రామర్​ స్కూల్​, 2. ఆల్​ సెయింట్స్​ స్కూల్​, 3. మహబూబ్​ కాలేజ్​.
  •     పాతబస్తీలో చార్మినార్ వద్ద ధర్మావంత్​ హైస్కూల్​, సికింద్రాబాద్​లోని కీస్​ హైస్కూల్​ను బాలికల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి . 
  •     నిజాం రాజ్యంలో విద్యావిదానంలో 1884 సంవత్సరం గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. 
  •     1884లో ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​ సయ్యద్​ హుస్సేన్​ బిల్ గ్రామి(నవాబ్​ ఇమాద్​ ఉల్​ముల్క్​)ను విద్యాశాఖాధికారి లేదా డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ ఇన్​స్ట్రక్షన్​గా నియమించారు. 
  •     అప్పటికే అమల్లో ఉన్న విద్యా విషయాలపై సమగ్ర సర్వే జరిపి విద్యా విధానాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి సూచనలు చేసిన ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ విద్యాధికారి ఎం.టి.ఎ.మ్యేయో.
  •     హైదరాబాద్​లో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపనకు అవకాశాలు పరిశీలించాలని ఏడో నిజాం విద్యాధికారి ఎం.టి.ఎ.మ్యేయో కోరారు. 
  •     నిజాం రాజు ప్రాథమిక విద్య పూర్తి ఉచితమని 1921లో ఫర్మానా జారీ చేశారు. 
  •     ప్రాథమిక విద్య పర్యవేక్షణకు నిజాం ప్రభుత్వం 1939లో ఆధీనంలోకి తీసుకుంది. 
  •     1948 వరకు హైదరాబాద్​ రాజ్యంలో ప్రాథమిక విద్యా బోధన ఉర్దూ భాషలో జరిగింది. 
  •     హైదరాబాద్​ రాజ్యంలో ఉర్దూలో ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని 1873లో ప్రతిపాదించిన ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు రఫయార్​జంగ్​, జమీలుద్దీన్​ అఫ్​ఘనీ.
  •     1913లో దారుల్​ ఉల్​ ఉలూం కాలేజ్​ విద్యార్థులు ఓల్డ్​ బాయిస్​ సంఘంగా ఏర్పడి నిజాం రాజు విశ్వవిద్యాలయ ఏర్పాటు అవసరం గురించి ప్రతిపాదనను సమర్పించారు. 
  •     ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎకరాల్లో స్థాపించడానికి ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ రాజ శాసనాన్ని 1918 ఆగస్టు 28న జారీ చేశారు. 
  •     ఉస్మానియా యూనివర్సిటీ తరగతులు తొలుత 1919లో ఆబిడ్స్​లోని కిరాయి ఇండ్లలో ప్రారంభమయ్యాయి. 
  •     ప్రస్తుతం ఉన్న 1400 ఎకరాల యూనివర్సిటీ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం సర్వే చేసి ప్రొఫెసర్​ సర్​ ప్రాట్రిక్​ జెడెస్​ అనే ఆంగ్లేయుడు ఎంపిక చేశాడు. 
  •     ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్​ కళాశాల నిర్మాణానికి బ్రెజిలియన్ శిల్పి జాస్ఫర్​ రూపకల్పన చేశారు. 
  •     ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్​ కళాశాల నిర్మాణం 1934లో మొదలై 1939లో ముగిసింది. దీని ఖర్చు రూ.36లక్షలు. 
  •     కోఠిలోని ఉమెన్స్​ కాలేజిని 1924లో స్థాపించారు. 
  •     వరంగల్​ కాలేజిని 1934లో స్థాపించారు. 
  •     నాంపల్లిలోని జనానా బాలికల పాఠశాలను 1890లో ప్రారంభించారు. 
  •      దళితుల కోసం ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలను 1916–17లో ఏర్పాటు చేసింది.