ఆర్మూర్, వెలుగు : వినాయక విగ్రహాల తయారీదారులు, విక్రేతల నుండి టాక్స్ వసూలు చేయొద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ ను ఆకస్మికంగా సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సెక్షన్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
మున్సిపల్ అధికారులు తై బజార్, టాక్స్ చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వినాయక విగ్రహాల విక్రయదారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన బిల్డింగులకు లేని టాక్స్ లు గుడిసెలకు ఎందుకు వేస్తున్నారని, విగ్రహాలు తయారీదారుల నుండి టాక్స్, తై బజార్ వసూలు చేయవద్దన్నారు.