AUS vs IND: లెక్క సరి చేశాడు: జైశ్వాల్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్

భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు (డిసెంబర్ 6) రెండో టెస్ట్ ప్రారంభమైంది. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు పింక్ బాల్ ను ఉపయోగిస్తున్నారు. డే నైట్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మూడు మార్పులతో అడిలైడ్ టెస్టులో టీమిండియా బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, రవి చంద్రన్ అశ్విన్ రెండో టెస్టుకు వచ్చేశారు. పడికల్, జురెల్, సుందర్ బెంచ్ కే పరిమితమయ్యారు. 

భారత్ కు ఇన్నింగ్స్ తొలి బంతికే బిగ్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తొలి బంతికే ఔటయ్యాడు. స్టార్క్ వేసిన తొలి బంతిని ఆడే క్రమంలో ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. స్టార్క్ కు ఇది ప్రతీకార వికెట్ అని చెప్పుకోవాలి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ స్టార్క్ ను జైస్వాల్ స్లెడ్జింగ్ చేశాడు. నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని అతనిపై సెటైర్ విసిరాడు. 

స్టార్క్ మాత్రం సైలెంట్ గా ఉండి బంతితోనే సమాధానమిచ్చాడు. ఈ సిరీస్ లో మూడు ఇన్నింగ్స్ లో స్టార్క్ బౌలింగ్ లో జైశ్వాల్ ఔట్ కావడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ నిలకడగా ఆడుతుంది. తొలి గంట ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (25), రాహుల్ (11) ఉన్నారు. జైశ్వాల్ డకౌట్ కాగా.. ఈ వికెట్ స్టార్క్ కు దక్కింది.