పేదలకు సన్నబియ్యం అందిస్తాం : మంత్రి సీతక్క

  • రాష్ట్ర మంత్రి సీతక్క
  • పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

పర్వతగిరి, వెలుగు: ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను కొంచెం టైం తీసుకుని సంపూర్ణంగా అమలు చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.  వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలో గురువారం నూతనంగా నిర్మించిన పీఏసీఎస్​బిల్డింగ్, 500 మెట్రిక్​ టన్నుల రెండు గోదాములు, రూ.12 కోట్ల 40 లక్షలతో వివిధ గ్రామాల్లో నిర్మాణం చేయాల్సిన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నాగరాజు , సొసైటీ  చైర్మన్​ గొర్రె దేవేందర్​ అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో ఆమె మాట్లాడారు. 

 గత బీఆర్​ఎస్  ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు వెయ్యి కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు.  ప్రతి పేదవాడికి  సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో రూ. 500 బోనస్​ పెట్టి సన్నాలను కొంటున్నామన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం డెవలప్​ మెంట్ కోసం ఎమ్మెల్యే నాగరాజు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాడన్నారు. అనంతరం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను మంత్రి సీతక్క లబ్ధిదారులకు అందించారు. ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్​ చైర్మన్​ రవీందర్​రావు, కుడా చైర్మన్​ వెంకటరామిరెడ్డి, ఆయిల్​ ఫెడరేషన్​ చైర్మన్​ రాఘవరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ,  అడిషన్​ కలెక్టర్​ సంధ్యారాణి, డీపీవో శ్రీరామ్​రెడ్డి, డీఆర్డీవో కౌసల్యాదేవి, స్పెషల్​ ఆఫీసర్​ నీరజ, తహసీల్దార్​ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్​నాయక్​, ఎంపీవో శ్రీనివాస్​, కాంగ్రెస్ కిసాన్​ సెల్​​ జిల్లా అధ్యక్షుడు దేవేందర్​రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్​నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

మంగపేటలో రూ. 52 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం 

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రూ. 52 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ పనులను గురువారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మంగపేట మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందన్నారు. హేమాచల లక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రూ. 1.10 కోట్లు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. గురువారం ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ నుంచి ఎరుకలవాడ వరకు రూ.80లక్షల నిధులతో నిర్మించిన రోడ్డు పనులను కలెక్టర్​ దివాకరతో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను  అభివృద్ధి చేస్తామన్నారు.  మంత్రి  సీతక్క, కలెక్టర్ టీఎస్‌ దివాకర్ మహిళలతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. 

ALSO READ | 12 మిల్లుల్లోనే 19,757 టన్నులు