అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు ఉదయించాడు. మీన రాశిలో ఉదయించిన బుధుడు ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు ఉదయించాడు. కుంభ రాశిలో అస్తంగత్వ దశలోకి వెళ్ళిన బుధుడు మీన రాశిలో ఉదయించాడు. మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారం, స్నేహం, తెలివితేటలు మొదలైన వాటికి బుధుడు బాధ్యతగా పరిగణిస్తారు.మీన రాశిలో బుధుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల అదృష్టం మెరిసిపోతుంది. ఇప్పుడు ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం. . .
బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్ర గ్రహాలు కాగా చంద్రుడు, అంగారకుడు శత్రు గ్రహాలు. బుధ గ్రహం బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అత్యుత్తమ సంభాషణ శైలి కలిగి ఉంటాడు. తెలివితేటలతో అందరినీ ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. చదువులో రాణిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. అదే బుధుడు బలహీన స్థితిలో ఉంటే శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. చదువులో వెనుకబడతారు. వ్యాపారంలో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
మేష రాశి: బుధుడు ఉదయించడం మేష రాశి వారికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు అనుగ్రహంతో మీ పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోకుండా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. బుధుడి ప్రభావంతో సమాజంలో మీ గౌరవ స్థాయిలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వానికి ప్రజలు ముగ్ధులవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆర్ధిక పరంగా పుంజుకుంటారు. ప్రమోషనల్ వచ్చి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. అయితే నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పల్ల జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారికి బుధుడి రాక శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష లెక్కల ప్రకారం ఈ కాలంలో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. అసంపూర్తి పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. ఇది అన్నింటికీ అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి బుధుడు ఉదయించడం శుభసూచకాలను ఇస్తుంది. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ పనికి ముగ్ధులు అవుతారు. ఈ కాలం మీకు చాలా శుభదాయకంగా ఉంటుంది.
బుధాదిత్య రాజయోగం
బుధుడు ప్రవేశించిన మీన రాశిలో ఇప్పటికే సూర్యుడు, రాహువు సంచరిస్తున్నారు. బుధుడు సూర్యుడుతో సంయోగం చెందటం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైనది.
బుధుడిని బలపరిచే పరిహారాలు: మీ జాతకంలో బుధుడి స్థానం బలహీనంగా ఉంటే ఈ నివారణలు పాటించడం వల్ల అదృష్టంగా మారిపోతుంది. బుధుడు ప్రతికూల ప్రభావాల వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. విద్యాపరమైన సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. అందువల్ల జ్యోతిష్యులు బుధుడిని శాంతింప చేసేందుకు కొన్ని నివారణలు సూచించారు.
బుధుడి అనుగ్రహం పొందడం కోసం వీలైనంతవరకు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. మహిళలను గౌరవించాలి. వ్యాపారంలో నిజాయితీగా ఉండాలి. విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. బుధవారం ఉపవాసం ఉంటే మంచిది.మీ ఇంట్లో లేదా వ్యాపారం కార్యాలయంలో బుధ యంత్రాన్ని అమర్చుకోవచ్చు. అలాగే నాలుగు లేదా పది ముఖ రుద్రాక్షలు ధరించవచ్చు. జ్యోతిష్యులు సలహా ప్రకారం మాత్రమే ఇవి పాటించాలి.
.