డిసెంబర్​లోపు ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ పూర్తి : మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సిటీలోని 16వ డివిజన్ పద్మానగర్‌‌‌‌‌‌‌‌లో రూ.14కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌‌‌‌ను  డిసెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మేయర్ సునీల్‌‌‌‌రావు తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌‌‌‌ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్  చాహత్ బాజ్ పాయ్‌‌‌‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైజెనిక్ ఆహార పదార్థాలను అందించాలనే సంకల్పంతో బల్దియా ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్​మార్కెట్‌‌‌‌ నిర్మిస్తున్నామన్నారు. సిటీలో అత్యాధునిక హంగులతో నాలుగు మార్కెట్లను నిర్మిస్తున్నామన్నారు. ఆయనవెంట ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యం, ఏఈలు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు, తదితరులు  పాల్గొన్నారు.