రూ.2 కోట్ల గంజాయి, డ్రగ్స్‌ కాల్చివేత

  • 831 కేజీల గంజాయి,11 గ్రాముల ఎండీఎంఎ దహనం..

తల్లాడ వెలుగు: ఖమ్మం, మధిర, నేలకొండపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ ల పరిధిలో 91 కేసుల్లో పట్టుబడిన 831 కేజీల గంజాయి, 11గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను  అధికారులు కాల్చేశారు.  సోమవారం తల్లాడ మండలం గోపాల పేట సమీపంలోని    ప్రభుత్వ అమోదిత పొందిన ఏ డబ్ల్యు ఎం కన్సల్టింగ్ లిమిటేడ్‌లో డిస్పోజల్ అధికారి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు కోట్ల విలువ చేసే గంజాయి,  డ్రగ్స్ ను కాల్చారు.

 అధికారులు  అసిస్టెంట్‌ కమిషనర్‌ జి .గణేశ్​, డీసీఈఓ నాగేందర్‌రెడ్డి,ఎస్‌హెచ్‌ఓలు  పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్​ను  కాల్చివేసిన ఎక్సైజ్‌ అధికారులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్​మెంట్​ డైరెక్టర్‌ వి.బి. కమలహసన్‌రెడ్డి అభినందిచారు.