వివాహిత ఆత్మహత్య

భూదాన్ పోచంపల్లి, వెలుగు : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం  ప్రకారం.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన నర్రా నాగరాజు, మాధవి దంపతులు  భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖ్ గ్రామానికి వలస వచ్చి  కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు(2), పాప(10 నెలలు) ఉన్నారు. సోమవారం భర్త కూలీ పనులకు వెళ్లిన తర్వాత మాధవి(35) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.