2023కి వీడ్కోలు చెప్పేశాం. 2024లో అడుగు పెట్టాం. ఈ సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి 2024 వ సంవత్సరంలో ప్లాన్ చేసుకోవచ్చు. 2024లో ఇతర సెలవులతోపాటుగా వీకెండ్ కలిసి వస్తుంది. ఫ్యామిలీతో కలిసి టూర్స్ ప్లానింగ్ చేసుకునేందుకు బాగుంటుంది. ఆఫీసుకు మీరు సెలవు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు. ఉద్యోగస్తులు ఏ రోజుల్లో ఫ్యామిలీ ట్రిప్ నకు ప్లాన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
-
జనవరి రెండో వారంలో 13వ తేదీ శనివారం. ఆ తర్వాత జనవరి 14 ఆదివారం, 15 జనవరి అంటే సోమవారం మకర సంక్రాంతి. పొంగల్ సెలవులు కలిసి వస్తాయి. మీకు కావాలంటే జనవరి 16న సెలవు తీసుకొని 4 రోజుల సెలవుతో ప్రయాణం చేయవచ్చు.
-
జనవరి 26 రిపబ్లిక్ డే ఈ సంవత్సరం శుక్రవారం వస్తుంది. జనవరి 27 శనివారం, జనవరి 28 ఆదివారంతో సహా 3 సెలవులు ఉన్నాయి. సరిగా ప్లాన్ చేసుకుంటే దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలు తిరిగి రావొచ్చు.
-
మార్చి మొదటి సెలవుదినం మహా శివరాత్రి, ఇది శుక్రవారం వచ్చింది. మార్చి 8 అన్నమాట. మరుసటి రోజు శనివారం అంటే మార్చి 9, తర్వాత ఆదివారం మార్చి 10 సెలవు. నిజానికి మార్చిలో లాంగ్ వీకెండ్స్ ఎక్కువగా ఉన్నాయి.
-
హోలీ శనివారం మార్చి 23, ఆదివారం మార్చి 24, మార్చి 25, 26 తేదీలలో సెలవు తీసుకుని నాలుగురోజుల టూర్ ప్లాన్ చేసుకోవచ్చు
-
మార్చిలో మరో లాంగ్ వీకెండ్ ఉంది. శుక్రవారం మార్చి 29 గుడ్ ఫ్రైడే. మార్చి 30 శనివారం, మార్చి 31 ఆదివారం.
-
గురువారం మే 23న బుద్ధ పూర్ణిమ. మీరు మే 24 శుక్రవారం సెలవు తీసుకుంటే మే 25 శనివారం, 26 మే ఆదివారం అదనపు రోజులు లభిస్తాయి. దూరపు ప్రయాణాలు చేయవచ్చు.
-
జూన్‌లో లాంగ్ వీకెండ్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు శనివారం, తరువాత ఆదివారం జూన్ 16, సోమవారం జూన్ 17 బక్రీద్ సెలవులు.
-
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం గురువారం వస్తుంది. శుక్రవారం అంటే ఆగస్టు 16న ఒక రోజు సెలవు తీసుకుంటే ఆగస్టు 17 శనివారం, ఆగస్టు 18 ఆదివారం అవుతుంది. ఆపై ఆగస్టు 19వ తేదీ సోమవారం రాఖీ పండుగ సెలవు.
-
24 ఆగస్టు శనివారం, 25 ఆగస్టు ఆదివారం. ఆగస్టు 26వ తేదీ సోమవారం జన్మాష్టమి జరుపుకొంటారు. మీరు మీ మూడు రోజుల సెలవులతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.
-
ఓనం 5 సెప్టెంబర్ గురువారం వస్తుంది. ఆ తర్వాత శుక్రవారం అంటే సెప్టెంబర్ 6న లీవ్ తీసుకుంటే.. సెప్టెంబర్ 7న శనివారం. సెప్టెంబర్ 8 ఆదివారం. ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
-
సెప్టెంబర్‌లో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది. సెప్టెంబర్ 14 శనివారం, సెప్టెంబర్ 15 ఆదివారం, సెప్టెంబర్ 16 సోమవారం ఈద్ మిలాద్ ఉన్ నబీ.
-
అక్టోబర్ 11న శుక్రవారం నవమి. శనివారం అక్టోబర్ 12న దసరా, అక్టోబర్ 13 ఆదివారం సెలవుదినం. మీరు మీ మూడు రోజుల యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
-
నవంబర్ 1 దీపావళి శుక్రవారం. నవంబర్ 2 శనివారం సెలవు తీసుకుంటే .. నవంబర్ 3 ఆదివారం.
-
నవంబర్ 15 గురునానక్ జయంతి. నవంబర్ దీని తర్వాత రోజు శనివారం, నవంబర్ 17 ఆదివారం.
2024లో లాంగ్ వీకెండ్స్ ఎక్కువగా వస్తు్న్నాయి. సరిగా ప్లాన్ చేసుకుంటే ఎంచక్కా ఎంజాయ్ చేయెుచ్చు. కావాల్సిందల్లా మీ ప్లానింగ్ మాత్రమే. ఇంకేం ఇప్పుడే ఎక్కడెక్కడికి వెళ్లాలో లిస్ట్ వేసుకోండి.