ఘనంగా కురుమూర్తి రాయుడి అలంకారోత్సవం

  • ఘనంగా సాగిన అలంకారోత్సవం
  • ఆత్మకూర్​ ఎస్​బీఐ నుంచి క్షేత్రం వరకు సాగిన ఊరేగింపు

చిన్నచింతకుంట, వెలుగు :  కురుమూర్తి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారి అలంకారోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆభరణాలను కురుమూర్తి రాయుడికి అలంకరించడంతో కాంచన గుహ బంగారు కాంతులీనింది. ఉదయం ముక్కెర వంశస్తులు స్వామి వారికి మణులు, మాణిక్యాలు, వైడుర్యాలు, పచ్చలు తొడిగిన బంగారు ఆభరణాలను వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎస్​బీఐ బ్యాంకు నుంచి బయటకు తీశారు. అక్కడ బ్యాంకు ఆవరణలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆభరణాల పెట్టెను భారీ జనసందోహం మధ్య ఊరేగించారు.  

ఊరేగింపు ఎస్​బీఐ బ్యాంకు నుంచి మదనాపురం మండలంలోని కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలోని ఆత్మకూర్​ సంస్థానాధీశుడైన రాజా శ్రీరామ్​ భూపాల్​ గృహానికి చేరుకుంది. అక్కడ వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా సంస్థానాధీశుడితో పాటు దేవరకద్ర, మక్తల్​ ఎమ్మెల్యేలు జి.మధుసూదన్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్​ రెడ్డి, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​ రెడ్డి ఆభరణాలను దర్శించుకున్నారు.

అనంతరం డప్పు వాయిద్యాల మధ్య అభరణాల పెట్టెను సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కురుమూర్తి క్షేత్రానికి చేర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులకు ఆలయ చైర్మన్​ గోవర్దన్​ రెడ్డి, ఆలయ ఈవో మదనేశ్వర్​ రెడ్డి ఆభరణాల పెట్టెను అప్పగించారు.  సాయంత్రం ఆరు గంటలకు ఆభరణాలను మూల విరాట్​కు అలంకరించారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. ఊరేగింపు సందర్భంగా వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

మదనాపురం వెలుగు: కురుమూర్తి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి స్వర్ణకారుడు గాడిల వంశీయులు లక్ష్మీనారాయణ ఆభరణాలు ఎత్తుకున్నారుడీఎస్పీ సీఐ  ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెంకట నారాయణ నాగన్న యాదవ్ రాజు వర్ధన్ రెడ్డి వడ్డే కృష్ణ హనుమాన్ రావు వడ్డే రాములు మని వర్ధన్ రెడ్డి శేఖర్ నాగరాజు తదితరులుపాల్గొన్నారు.