మోదీని మూడోసారి ప్రధానిని చేయాలి : కంచెట్టి గంగాధర్

ఆర్మూర్, వెలుగు:  దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని ఇందుకోసం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ను గెలిపించాలని ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు.  బుధవారం ఆర్మూర్‌‌లోని 16 వ వార్డులో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, 3వ వార్డులో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ యామాద్రి భాస్కర్ ఆధ్వర్యంలో  డోర్​ టు డోర్ బీజేపీ ప్రచారం నిర్వహించారు. 

 దేశం కోసం ధర్మం కోసం బీజేపీకే ఓటు వేయాలని కోరారు.  బూత్ అధ్యక్షుడు యేలిగేటి విఠల్, పుప్పాల గిరి, లక్ష్మణ్, వేముల లింగోజీ,  రఘు, నాయిని భాస్కర్, మామిడా సుదర్శన్ కార్యకర్తలు పాల్గొన్నారు.