చెరువులో చేపపిల్లల విడుదల

భిక్కనూరు, వెలుగు: మండలంలోని జంగంపల్లి గ్రామ పెద్దచెరువులో మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు.  

కార్యక్రమంలో తహసీల్దార్​శివప్రసాద్, ఎంపీడీవో రాజ్​కిరణ్​రెడ్డి,సెక్రటరీ గుడిసె బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేశ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్​రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నరేందర్​​రెడ్డి, గణేశ్​రెడ్డి, చిన్నోళ్ళ శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

సిరికొండ, వెలుగు: అన్ని వర్గాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, మండల అధ్యక్షుడు బాకారం రవి అన్నారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో మంగళవారం చేప పిల్లలను వదిలారు. మండలంలోని 16 గ్రామాల్లోని చెరువుల్లో విడుదల చేసేందుకు 65 వేల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు.