ప్రభుత్వ స్కీమ్‌లు పక్కాగా అమలు చేస్తాం : ఆశిష్ సంగ్వాన్

  •     విద్య, వైద్యానికి  అధిక ప్రయార్టీ
  •     వెలుగు' తో  కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​  సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ స్కీమ్​లను జిల్లాలో  పక్కాగా అమలు జరిగేలా చూస్తానని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.  జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆశిష్ సంగ్వాన్  శుక్రవారం ‘వెలుగు’ ప్రతినిధితో మాట్లాడారు.  విద్యా, వైద్య రంగాలపై ఎక్కువ ఫోకస్ చేస్తామని కలెక్టర్ అన్నారు.  అమ్మ ఆదర్శ స్కూల్స్ వర్క్స్ వారం రోజుల్లో కంప్లీట్ చేయిస్తామన్నారు.  ప్రభుత్వ హాస్పిటల్స్​కు వచ్చే రోగులకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

పెండింగ్​లో ఉన్న ధరణి అప్లికేషన్ల పరిష్కారాన్ని  స్పీడప్​ చేస్తామన్నారు.  ప్రతి సోమవారం ప్రజావాణిని మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్​ దృష్ట్యా సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు,  గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూస్తామని టౌన్ లో సమస్య ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సప్లయ్ చేస్తామని తెలిపారు.