ప్రజావాణిలో సమస్యలు వెంటనే పరిష్కరించండి : ఆశిష్ సంగ్వాన్

  • కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డిటౌన్​,  వెలుగు: ప్రజావాణిలో వచ్చే సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌‌‌‌లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 96  ఫిర్యాదులు వచ్చాయన్నారు.   కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్​రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.  ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలన చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్​ ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. 

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

రానున్న ఎండకాలంలో  నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు రెడీ చేయాలని కలెక్టర్​ ఆశిష్​సంగ్వాన్​ అధికారులకు ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో  అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌లో  కలెక్టర్​ మాట్లాడుతూ.... గతేడాది తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ సారి సమస్య రాకుండా అద్దె బోర్లను పరిశీలించాలన్నారు.  గ్రామాల్లో శానిటేషన్​ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్నారు. రెసిడెన్సియల్​ స్కూల్స్,  హాస్టల్స్​లో  నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.  

ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్పీడప్​ చేయాలన్నారు.  ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యాంగులకు పంపిణీ చేసిన డబుల్​ బెడ్​ రూం ఇండ్ల వివరాలను వెంటనే సమర్పించాలని ఎంపీడీవోలకు ఆదేశించారు.  మీటింగ్​లో అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్​, శ్రీనివాస్​రెడ్డి,  ఆర్డీవో రంగనాథ్​రావు,  ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.