నర్సింగ్​కాలేజీ పనులు స్పీడప్​

  • అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
  • త్వరలో సీఎం చేతుల మీదుగా వర్చువల్​గా ప్రారంభం 
  • వచ్చె నెల ఫస్ట్​నుంచి క్లాసులు​ 

జనగామ, వెలుగు: జనగామ గవర్నమెంట్​నర్సింగ్​కాలేజీ ప్రారంభానికి రెడీ అవుతోంది. గతేడాది గవర్నమెంట్ మెడికల్​కాలేజీ రాగా, ఈ యేడాది నర్సింగ్​కాలేజీ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల గవర్నమెంట్​ఉత్తర్వులు ఇవ్వగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైంది. కాలేజీలో 52 సీట్లు ఉండగా, 51 మంది స్టూడెంట్లు చేరారు. వీరికి వచ్చే నెల ఫస్ట్​ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ఆదేశాలతో ఏర్పాట్లు 
స్పీడందుకున్నాయి.

వర్చువల్​గా ప్రారంభం..

గవర్నమెంట్​నర్సింగ్​కాలేజీని ఈనెలాఖరు వరకు సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​పద్ధతిలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె హాస్టల్​బిల్డింగ్​ను ఇందుకోసం కేటాయించి స్టూడెంట్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్డింగ్​రెండు అంతస్తులుండగా గ్రౌండ్​ఫ్లోర్ ను మెడికల్​కాలేజీ స్టూడెంట్లకు హాస్టల్​వసతికి ఉపయోగిస్తున్నారు. రెండో అంతస్తులో నర్సింగ్​కాలేజీకి కేటాయించారు. నాలుగు సంవత్సరాలుండే బీఎస్సీ నర్సింగ్​కోర్సుకు మొదటి సంవత్సరం వరకు ఈ బిల్డింగ్​ఉపయోగపడనుంది. వచ్చే యేడాది వరకు గ్రౌండ్​ఫ్లోర్​లో ఉన్న మెడికల్​కాలేజీ స్టూడెంట్లకు మరోచోట హాస్టల్​ఏర్పాటు చేస్తే సెకండ్​ఇయర్​నర్సింగ్​విద్యా బోధనకు ఇక్కడ ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శాశ్వత బిల్డింగ్​ను ప్రస్తుత జిల్లా కేంద్రం శివారు చంపక్​హిల్స్​లోని ఎంసీహెచ్​సమీపంలో నిర్మించనుండగా, దాని నిర్మాణం పూర్తయ్యేందుకు టైం పట్టనుంది. దీంతో అప్పటి వరకు ధర్మకంచె బిల్డింగ్​లోనే నర్సింగ్​కాలేజీ కొనసాగనుంది.

అడ్మిషన్లు పూర్తి..

ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్​లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. మొత్తం 51 మంది స్టూడెంట్లు ఇక్కడికి అలాట్​అయ్యారు. నర్సింగ్​కాలేజీకి డాక్టర్ గరిక​సుధను ప్రిన్సిపాల్​గా, భాగ్యలక్ష్మిని వైస్​ప్రిన్సిపాల్​గా నియమించారు. ప్రిన్సిపాల్​సుధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.​ ఐదుగురు టీచింగ్​ఫ్యాకల్టీని కూడా నియమించారు. మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు శానిటేషన్​వర్కర్లు ఒకటి రెండు రోజుల్లో వస్తారని అధికారులు తెలిపారు. ధర్మకంచె బిల్డింగ్​లోని రెండో అంతస్తులో పది గదులు ఉండగా, రెండు అడ్మినిస్ట్రేషన్, మిగిలినివి క్లాసులు, ల్యాబ్​లు, డైనింగ్​కోసం ఊపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ALSO READ : నైతికత పాటిస్తేనే.. రాజ్యాంగానికి గౌరవం

ఫస్ట్​నుంచి క్లాసులు.. 

నర్సింగ్​కాలేజీ పనులు స్పీడ్​గా జరుగుతున్నాయి. కలెక్టర్​ఆదేశాల మేరకు వచ్చే నెల ఫస్ట్​నుంచి క్లాసులు మొదలుకానున్నాయి. సీఎం చేతుల మీదుగా వర్చువల్​పద్ధతిలో కాలేజీ ప్రారంభించే అవకాశం ఉంది. టీచింగ్​ఫ్యాకల్టీ కూడా అందుబాటులోకి వచ్చింది. స్టూడెంట్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్​గరిక సుధ, ప్రిన్సిపాల్, గవర్నమెంట్​నర్సింగ్​ కాలేజీ, జనగామ