ల్యాబ్ టెక్నిషియన్ తొలగింపు

  • వీ6 వెలుగు ఎఫెక్ట్ 

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ లో రోగులకు టెస్టులు చేయకుండా ప్రైవేట్ కు రిఫర్ చేయడం పై  వెలుగు కరీంనగర్ ఎడిషన్ లో ''జగిత్యాల హాస్పిటల్ లో ల్యాబ్ సిబ్బంది దందా'' అనే కథనం బుధవారం ప్రచురితమైంది. 

పేషెంట్  కు ఎల్డీహెచ్ టెస్టు ను రోగికి సూచించిన విషయం వాస్తమేనని, కానీ ల్యాబ్ టెక్నిషియన్ చారి ల్యాబ్ ఇంచార్జ్ అనుమతి లేకుండా ప్రైవేట్ ల్యాబ్ కు సూచించినట్లు గుర్తించారు. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగైన ల్యాబ్ టెక్నిషియన్ చారిని తొలగించినట్లు తెలిపారు. టీ హబ్ లో, జగిత్యాల ఆస్పత్రి ల్యాబ్ లో అన్ని రకాల టెస్ట్ లు నిర్వహిస్తున్నామని చెప్పారు.