ఎన్నికల కోసం కంట్రోల్​ రూమ్​ ప్రారంభం

కామారెడ్డి, వెలుగు : పార్లమెంట్ఎన్నికల దృష్ట్యా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​కంట్రోల్​రూమ్​ను ప్రారంభించారు. అనంతరం నోడల్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ.. నోడల్ ఆఫీసర్లు ప్రవర్తన నియమావళిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

సువిధ యాప్, 1950 టోల్​ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఫ్లయింగ్​ స్క్వాడ్​ టీమ్స్​అలర్ట్​గా ఉండాలన్నారు. నోడల్ ఆఫీసర్లు బావయ్య, మురళీకృష్ణ, అంబాజీ, ఏవో మసూరి అహ్మద్, ​జ్యోతి పాల్గొన్నారు.