Weather Update: హైదరాబాద్​ వాసులకు ఇక చుక్కలే...

మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి.  ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  మధ్యాహ్నం ఉష్ణోగ్రత పెరుగుతోంది. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతు నమోదువుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి, ఏప్రిలో, మేలో కూడా ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మోండా మార్కెట్. సరూర్ నగర్ లో గరిష్ఠంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బాలానగర్ లో 35.9 ఉష్ణోగ్రత నమోదయింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే ఈసారి ఎండలు మండిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

ఎండలు ఇంతగా ఉంటే మార్చి, ఏప్రిల్, మేలో హైదరాబాద్ వాసులకు చుక్కలు చూసే అవకాశం ఉంది. ఈసారి ఎండకాలంలోనే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. దీంతో ఎండల్లో ఎలా తిరగాలని నేతలు భయపడుతున్నారు.  మూలకున్న కూలర్లను తీసి దుమ్ము దులిపి వాడడం మొదలు పెట్టారు. చలి తగ్గడంతో రాత్రి వేళ్లల్లో ఫ్యాన్ల వినియోగం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఏసీల వాడకం కూడా పెరిగింది. దీంతో కూలర్లు, ఏసీలకు గిరాకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3,100 మెగావాట్ల డిమాండ్ ఉండగా.. రాత్రి 2,697 మెగవాట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది ఎక్కువ.  అధిక  ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.