చల్లని వాతావరణం ఇన్ఫ్లుయెంజా, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, ఉబ్బసం, కోవిడ్-19 వంటివి గుండె జబ్బులను ప్రేరేపిస్తున్నాయి. మాక్స్ హాస్పిటల్స్ కార్డియాలజీ చైర్మన్, హెడ్ డాక్టర్ బల్బీర్ సింగ్ ప్రకారం, శీతాకాలం.. దానికి తోడు పేలవమైన జీవనశైలి కారణంగా గత నెలతో పోలిస్తే గుండెపోటు కేసుల సంఖ్య రెండింతలు పెరిగింది. చలికాలంలో గుండెపై తీవ్ర ఒత్తిడి జరుగుతుందని, దేశంలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ బల్బీర్ సింగ్ అన్నారు. సగటున, రోజుకు రెండు గుండెపోటు కేసులు వస్తున్నాయని, జనవరిలో, ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చని అంచనా వేశారు.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో అధికంగా యువకులే ఉంటున్నారని, కావున రోగనిరోధక శక్తికి వయసుతో సంబంధం లేదని బల్బీర్ సింగ్ చెప్పారు. శీతాకాలంలో గుండె పోటు లాంటి గుండె సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఎందుకంటే, శీతాకాలంలో, రక్త నాళాలను శరీరానికి తీసుకెళ్లే నాళాలు కుంచించుకుపోతాయని, రక్త నాళాలు సంకోచించిస్తే అది బాష్పీభవనాన్ని నిరోధిస్తుందని, క్రమంగా అది వేడిని కోల్పోకుండా చేస్తుందని తెలిపారు.
చలికాలంలో వాయుకాలుష్యం పెరగడం కూడా ఒక కారణమని బల్బీర్ సింగ్ చెప్పారు. గుండెపోటుకు దారితీసే ఇతర కారకాలపై మాట్లాడిన ఆయన.. ధూమపానానికి అలవాటు కాకుండా ఉండాలన్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, అతిగా తినడం, మద్యం సేవించడం వంటి కారణాలు కూడా గుండెపోటుకు కారణమవుతున్నాయని తెలిపారు.