నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఐఎన్జీయూసీ బలోపేతానికి కృషి చేయాలి

సూర్యాపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ అనుబంధ జిల్లా అధ్యక్షుడిగా కాసాని పాపయ్యగౌడ్​ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు యరగాని నాగన్న ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ సభ్యుడు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి చేతుల మీదుగా శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పాపయ్యగౌడ్​కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వివిధ రంగాల కార్మికులను ఐఎన్టీయూసీలోకి ఆహ్వానించి సంఘం పటిష్టకు పాటుపడాలన్నారు.  

చేనేత ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు 

హుజూర్ నగర్, వెలుగు : చేనేత ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ముశం వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలీలు ఆయనను అభినందించారు. 

ఆర్థిక సాయం అందజేత 

చిట్యాల, వెలుగు : చిట్యాల మున్సిపాలిటీలో 10వ వార్డుకు చెందిన కొసనం యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం చిట్యాల మున్సిపాలిటీకి చెందిన ఎస్ కే నాగూర్ వల్లి పశ్చిమ బెంగాల్ లో జరిగే వాలీబాల్ టోర్నమెంట్ కు ఎన్నిక కావడంతో అతడి ఖర్చులకు రూ.5 వేల ఆర్థిక సాయం పంపించారు. ఆర్థిక సాయాన్ని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవదాస్, పట్టణ అధ్యక్షుడు మల్లయ్య అందజేశారు. 

సమస్యలను పరిష్కరించాలి

హుజూర్ నగర్, వెలుగు : గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శీను అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. 

ఇసుక టిప్పర్ల పట్టివేత

మేళ్లచెరువు, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను మేళ్లచెరువు పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఏపీ నుంచి మేళ్లచెరువుకు తరలిస్తుండగా శుక్రవారం రేవూరు గ్రామ సమీపంలో రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరమేశ్ తెలిపారు.

హెడ్మాస్టర్ సస్పెన్షన్​

సూర్యాపేట, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్మాస్టర్​ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23న టేకుమాట్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ను డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జడ్జి పి.శ్రీవాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడంతో ఆరా తీశారు. స్కూల్​లో భోజనం సరిగ్గా ఉండడం లేదని, మాడిపోయిన అన్నం పెడుతున్నారని జడ్జికి విద్యార్థులు చెప్పారు. దీంతో హెడ్మాస్టర్ పాపయ్యపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఎంక్వైరీ చేయాలని డీఈవో అశోక్ ను కలెక్టర్ అదేశించారు. విచారణలో వాస్తవాలు తేలడంతో హెడ్మాస్టర్ పాపయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.