మాలల సింహగర్జనను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి : గుమ్మడి కుమారస్వామి

గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్​లో డిసెంబర్ 1న జరగనున్న మాలల సింహగర్జన సభలో మాలలు, ఉపకులస్తులు పెద్దసంఖ్యలో పాల్గొని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు గుమ్మడి కుమారస్వామి కోరారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలను మాలలు దోచుకుంటున్నారన్న దుష్ర్పచారాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. 

జనాభా ప్రాతిపదికన మాలలు, ఉపకులాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగాల్లో రిజర్వేషన్లు, విద్య, వైద్య రంగాలు, అర్హులైన ఇండ్ల కేటాయింపు.. తదితర అంశాలపై సింహగర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  సింహగర్జన వాల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడర్లు  డేనియల్, దేవ వెంకటేశం, ఆరె దేవకరుణ, కనకరాజు, దశరథం, లక్ష్మణరావు, మద్దెల శ్రీనివాస్, వెంకట్, మల్లయ్య, కుమార్, భీంసేన్​, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 కోరుట్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న మాలల సింహగర్జన సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని మాలమహానాడు ప్రతినిధులు పిలుపునిచ్చారు.శుక్రవారం కోరుట్లలో సింహగర్జన సభ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాలమహానాడు నేత కాయితి శంకర్ ఆధ్వర్యంలో అవిష్కరించారు. కార్యక్రమంలో లీడర్లు కాయితి శంకర్, మెట్టు దాస్, ఉయ్యాల శోభన్, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాములు, వేల్పుల ప్రమోద్, గంగాధర్, రాజయ్య, సాయికుమార్, రుషికేశ్ పాల్గొన్నారు.