'తెలంగాణ’ అస్తిత్వ పోరాటానికి ప్రతీక : మంత్రి శ్రీధర్ బాబు 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్రం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని, అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కొనియాడారు. నిజాం చెర నుంచి విముక్తి పొంది, అఖండ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనమైన రోజు సెప్టెంబరు 17ను ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.  మంగళవారం కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల  గౌరవ వందనం స్వీకరించారు.

 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ మాట్లాడారు. అనాదిగా అణిచివేతకు గురైన తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాటాలు నిరంతరం కొనసాగాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని,  సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

 జడ్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్, బల్దియాలో  మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు జెండా ఆవిష్కరించారు . వేడుకల్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అభిషేక్ మహంతి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. పెద్దపల్లి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ నేరేళ్ల  శారద పాల్గొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగరేసి మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్, కలెక్టర్​ శ్రీహర్ష, అడిషనల్​ కలెక్టర్లు, 
ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రతి పేదోడికి సంక్షేమ ఫలాలు

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు రాంబాబు, గౌతంరెడ్డి, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి తదితరులు 
పాల్గొన్నారు.

సిరిసిల్లలో ప్రజా పాలన దినోత్సవం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలో --ప్రజా పాలన అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం  కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనప్పటికీ 60 ఏండ్ల అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఆరు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలుచేస్తున్నామన్నారు. అనంతరం మహమ్మద్ మైమిన్, నజీం సుల్తానా, గుమ్మడి అభయ్ పటేల్ కు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ సందీప్​ కుమార్ ఝా,అడిషనల్  కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.