Good Health : ఎప్పుడు చూసినా నీరసంగా.. డల్ గా ఉంటున్నారా.. అయితే ఈ ఫుడ్ తీసుకోండి..

కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు. ఏ పనీ చేయలేరు. త్వరగా అలసిపోతారు, నీరసంగానూ ఉంటారు. దీనికి అనారోగ్యం, పౌష్టికాహార లోపం, పని ఒత్తిడి వంటి పలు కారణాలు ఉన్నాయి. అయితే ఫిట్గా, యాక్టివ్ గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇప్పుడు అవేంటో చూద్దాం. . .

 ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్ ఉండవచ్చు. అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే పదార్ధాలను తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్ లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ALSO READ | నిద్ర పోయే ముందు వీటిని తినొద్దు.. తాగొద్దు..

 నిద్రలేమి వల్ల కూడా అనేక అనారోగ్యాలు వస్తాయి. మంచి నిద్రపట్టాలంటే రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి తీసుకుంటే సరిపోతుంది. శరీరంలో తగిన మోతాదులో రక్తం లేకపోయినా కూడా నీరసంగా ఉంటుంది. ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది.