కాకా యాదిలో.. బడుగుల మదిలో.. అందరివాడవయా జి వెంకటస్వామిజీ

జి వెంకటస్వామిజీ
అందుకో అంజలి
 ఇదే మా అందరి అభిమానం
    । అందరివాడవయా ।
రాజకీయాలలోన
తనదంటూముద్రవేసి
పదవులనెన్నో పొందావు
తెలంగాణకే కీర్తి తెచ్చావు
    । అందరివాడవయా ।
బడుగుల కోసం అడుగులు వేసి
గుడిసెల వెంకటస్వామిగ నిలిచి
బడులనుపెట్టి విద్యనునేర్పి
జీవనరాగం కూర్చావు
    । అందరివాడవయా ।
ఉద్యమాలకు ఊపిరివయి
తూటాతగిలి జైలులోమగ్గి
తెలంగాణ రాష్ట్రంచూసి
ప్రాణాలొదిలిన నీ సంకల్పం
ఎందరికో వరం
    । అందరివాడవయా ।
కార్మికలోకం మెచ్చగా
పథకాలెన్నో చేయగా
అంతర్జాతీయ ఖ్యాతి గడించి
దేశపేరుప్రతిష్ఠలు పెంచావు
    । అందరివాడవయా ।


డా. ముదిగొండ భవాని, 
తెలుగు అధ్యాపకురాలు,
డా. బీఆర్​ అంబేద్కర్​ కళాశాల