రాత్రిళ్లు పుస్తకాలు చదువుతూ.. ఇంట్లో పడుకున్నవాళ్లను లైట్​ వేసి డిస్టర్బ్​ చేయకుండా ఉండాలంటే..

రాత్రిళ్లు పుస్తకాలు చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటివాళ్లు ఇంట్లో పడుకున్నవాళ్లను లైట్​ వేసి డిస్టర్బ్​ చేయకుండా ఉండాలంటే ఇలాంటి గాడ్జెట్​ వాడాలి. ఈ డెస్క్​లైట్​ని ఎంబైస్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఇందులో రీచార్జబుల్​ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్​ పెట్టడానికి టైప్​సీ పోర్ట్​ ఉంటుంది. దీనికి ఉండే 3 -గ్రేడ్ టచ్ బటన్​తో ఎల్​ఈడీ లైట్​ బ్రైట్​నెస్​ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.  చాలా చిన్న సైజులో ఉండడం వల్ల టేబుల్​ మీద తక్కువ స్పేస్​ తీసుకుంటుంది. 

ఫోల్డబుల్ డిజైన్ వల్ల ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లొచ్చు. ఎక్కువ టైం వాడినా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేందుకు దీన్ని ఫ్లికర్-ఫ్రీ, యాంటీ-గ్లేర్ ఫీచర్లతో తయారుచేశారు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్‌‌‌‌ప్లే ఉంటుంది. అందులో టైం, తేదీ కనిపిస్తాయి. 

ధర : రూ. 1,999