ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి

నర్సింహులపేట, వెలుగు: గ్రామాలు, తండాల్లో ప్రజలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని,  ఇసుక మాఫియా వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ తోపాటు, తాను కూడా బద్నాం అవుతున్నానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లో రైతు భరోసా సంబురాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వాలని, తద్వారా వచ్చిన డబ్బులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. ఉమ్మడి వరంగల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో మాధవి, పార్టీ మండల, పట్టణాధ్యక్షులు జినుకల రమేశ్, కడుదుల రామకృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ పొన్నం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.