Health Tips: నీళ్లు తాగి కొబ్బరి బొండం పారేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి...

సమ్మర్​ సీజన్​... ఎండ ఇరగదీస్తుంది. బయటకు వెళ్తే చాలు.. జనాలు చాలా మంది కొబ్బరి బొండంలోని .. కొబ్బరి నీళ్లు తాగుతారు.  ఇది ఆరోగ్యం కూడా.. అయితే కొంతమంది.  నీరు తాగిన తరువాత అందులో పల్చగా ఉండే కొబ్బరిని కూడా తింటారు.  ఇది తింటే ఏమవుతుంది.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..ఆరోగ్యానికి.. మంచిదా.. చెడ్డదా.. కొబ్బరిబొండాంలోని కొబ్బరి తింటే  ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  . 

మార్కెట్లో లభించే వివిధ కూల్ డ్రింక్స్ తాగడానికి ప్రజలు అలవాటు పడిపోయారు.. ఆరోగ్యం బాగోక పోతే అప్పుడు అడపదడపా జ్యూసులు తాగుతున్నారు.. అవసరం అయితేనే తప్ప.. లేదంటే డాక్టర్లు సూచిస్తేనో కొబ్బరి బొండం నీళ్లు తాగే వాళ్ళు అతి తక్కువ మంది...  కొంతమంది సాధారణంగానే కొబ్బరి బొండం నీళ్లు తాగుతుంటారు.. కొబ్బరి బొండం నీళ్ళు తాగి ఆ బొండం లోపల ఉన్న కొబ్బరిని అందరూ పారేస్తూ ఉంటారు.. ఈ కొబ్బరిని తింటే ఆరోగ్యానికి బోనస్ పాయింట్..!! అయితే కొబ్బరి బొండం లోపల ఉన్న లేత కొబ్బరినీ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

 కొబ్బరి బొండంలోని  నీరు తాగిన తర్వాత  చాలా మంది కొబ్బరిని తింటుంటారు. ఈ కొబ్బరి పల్చగా  ఉండి..యమ టేస్ట్​ ఉంటుందనుకోండి.. అయితే ఎంత రుచి ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  కొబ్బరి నీళ్లతో పాటు  కొబ్బరి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  అందుకే  వృద్దులు.. అనారోగ్యంతో బాధపడేవారు.. గర్భిణీ స్త్రీలు దాదాపు రోజూ ఎండాకాలంలో కొబ్బరి నీరు తాగుతారు.  Coconut water ప్రతి సీజన్​ లో తాగిన తరువాత.. కొబ్బరి బొండంలోని కొబ్బరి తింటే చాలా ప్రయోజనాలున్నాయి. 

లేత కొబ్బరిలో విటమిన్ ఏ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, నియాసిన్ థయామిన్ అధికంగా ఉన్నాయి. ఇది చక్కటి న్యూట్రిషన్ ఫుడ్.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. బరువు తగ్గాలను కునేవారు కొబ్బరిని తినాలి.  మలబద్ధకంతో బాధపడేవారికి ఈ లేత కొబ్బరి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ కొబ్బరి పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుంది.

కొబ్బరిలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.అజీర్తి, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.   గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ క్రీమ్ జీర్ణ సమస్యలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 

కొబ్బరి బొండం లోని తెల్లని గుజ్జు  మంచి ఆహారం. దీనిలో తక్కువ శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి. మూత్ర సంబంధిత జబ్బులను, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి బొండం నీళ్ళు బెస్ట్ ఎనర్జీ డ్రింక్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిని అందులో ఉన్న కొబ్బరినీ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండెజబ్బుల రానివ్వకుండా చేస్తుంది. వేసవికాలంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్ ఫాక్స్ తగ్గడానికి ఇది దోహదపడుతుంది. అలాగే కడుపులో ఉన్న పురుగులను హరిస్తుంది. ఈ లేత కొబ్బరి లో పంచదార వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. 

కొబ్బరి నూనె, కొబ్బరి పామ్ పుప్పొడి, కొబ్బరి ఉత్పత్తుల అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. కొబ్బరి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కొబ్బరిని ఎలా ఉపయోగిస్తారో దాన్ని బట్టి వాడడం చాలా మంచిది. ఒక వ్యక్తి రోజుకు 40 గ్రాముల కొబ్బరి తినవచ్చుమీరు ఖాళీ కడుపుతో కొబ్బరిని తీసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క గొప్ప మూలం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి, రోజంతా శక్తిని అందించడానికి సహాయపడుతుంది.

లేత కొబ్బరిలో చాల గుణాలు లభిస్తుంది. ఇవి మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ని వృద్ధి చేయడానికి సహాయ పడుతాయి. ఇక  లైంగిక సమస్యలతో బాధపడేవారు ఈ కొబ్బరిని తీసుకోవడం చాలా మంచిది. ఇక కొంతమంది పచ్చి కొబ్బరి, లేత కొబ్బరికి ఏం తేడా లేదు అని అంటారు. ఇక  పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎక్కువగా దగ్గు, నిమ్ము వంటి సమస్యలు కూడా వస్తాయి అని నిపుణులు తెలియ చేస్తున్నారు. కానీ, లేత కొబ్బరిని తీసుకోవడం అలాంటి సమస్యలు కూడా ఉండవు.  ఈ సారి మీరు కొబ్బరి బొండం నీళ్లు తాగినప్పుడు అందులో ఉన్న కొబ్బరిని కూడా టేస్ట్ చేయండి. ఒక్కసారి దీని రుచి తెలిస్తే అస్సలు వదలరు..