2023 ధనుర్మాసం: ఎప్పుడు ప్రారంభం అవుతుంది... దీని ప్రత్యేకత ఏమిటి..

దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులూ ధనుర్మాసం. ఈ ధనుర్మాస కాలంలో  తెల్లవారుజామున కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంచే ఏదో ఒకదానికోసం ప్రార్థించడం.  ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవన్నీ ద్రవిడుల సంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెలరోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.

2023 డిసెంబర్​ 16 ( అర్దరాత్రి 12.34)   నుంచి 2024 జనవరి 14 వరకు  

ధనుర్మాసం  శనితో సంబంధం ఉన్న మాసం. మార్గశిరలో ప్రారంభమై  పుష్య మాసం వరకు ఉంటుంది. 2023లో...  ధనుర్మాస ఘడియలు  2023 డిసెంబర్ 16న ( అర్దరాత్రి 12.34)  ప్రారంభమై ....2024 జనవరి 14న ముగుస్తాయి. అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారు

ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది.

ధనుర్మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది.  ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహ ప్రవేశం, నిశ్చితార్థం, వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి కావడమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  ఈ మాసంలో విష్ణువును పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది. విష్ణు భక్తులకు ఈ నెల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణుపూజ చేస్తారు.  

ఈ నెల ( ధనుర్మాసం)  మొత్తం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాలు ముగించుకుని వేకువజామున పూజలు ప్రారంభించి, సూర్యోదయానికి ముందే పూజలను ముగిస్తారు. దీనిని ధనుర్ పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రివేళ, ఉత్తరాయణం పగలు, అయితే ఈ ధనుర్మాసం రాత్రి, పగలు రెండూ కలగలిసి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి, స్వామిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. .