ఢిల్లీని ముంచెత్తిన వానలు.. ఎల్లో అలర్ట్.. వందేళ్లలో ఇదే తొలిసారి..

ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా వానలు దంచి కొడుతున్నాయి. కేవలం 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే.. ఢిల్లీని ఎంతలా వాన ముంచెత్తుతోందో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ లో ఇంతలా వానలు కురవడం 101 సంవత్సరాలలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో శనివారం ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలాంటి జడివాన ఇంతకు ముందు 1923 డిసెంబర్ 3న నమోదైంది. అప్పట్లో ఒకేరోజు 75.7 మి.మీ. కురిసి ఢిల్లీని అతలాకుతలం చేసింది.
 
అయితే ఇంత భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో  గాలి నాణ్యత కొద్దిపాటిగా మెరుగైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపింది. డేటా ప్రకారం, ఉదయం 11 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 142తో నాణ్యత కొద్దిగా పెరిగటానికి వర్షపాతం దోహదపడింది. 

Also Read :- జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్

శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు నగరవ్యాప్తంగా 31.4 మిమీ, పాలెం వద్ద 31.4 మిమీ, లోధి రోడ్‌లో 34.2 మిమీ, రిడ్జ్‌లో 33.4 మిమీ, ఢిల్లీ యూనివర్సిటీలో 39 మిమీ, పూసాలో 35 మిమీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ విభాగం (IMD) వారాంతానికి ఎల్లో హెచ్చరికను జారీ చేసిందిజ. 

 ఢిల్లీ-NCR ప్రాంతంలో కురిసిన ఈ భారీ వర్షపాతం వలన వారాంతంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని పేర్కొంది.

ఇక కుండపోత వర్షం కారణంగా రాజధానిలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఆర్‌కె పురం సెక్టార్-9లో  రోడ్డు ఒక భాగం కుంగిపోవడంతో కారు, బైక్ సింక్‌హోల్‌లో పడిపోయాయి. ఢిల్లీ వ్యాప్తంగా