Health Alert : మీ కంటి చూపు మసకగా కనిపిస్తుందా.. అయితే షుగర్ వచ్చే సూచనలు ఎక్కువ..!

ఒకసారి వస్తే జీవితాంత కాలం వెంటాడే  జబ్బు యాబెటిస్ .  మన దేశంలో లక్షలాది మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. హైదరాబాద్ డయాబెటిస్​ కు  రాజధానిగా పేరుపడింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న డయాబెటిస్ సమస్య ... ఇప్పుడు చిన్న వయసు వారిని కూడా వేధిస్తోంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు మంచి ఆహారం, రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. ఇవి లేకపోతే డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది. ఒకసారి తప్పు జరిగినా సరిదిద్దుకునేందుకు ఒక చిన్న అవకాశం ఉంది. అదే లక్షణాలను పసిగట్టి అప్రమత్తంగా ఉండటం. 

డయాబెటిస్ (షుగరు వ్యాధి) రెండు రకాలు...ఒకటి 'టైప్ 1 డయాబెటిస్', రెండోది 'టైప్ 2 డయాబెటిస్'.

 టైప్ 2 డయాబెటిస్ వస్తే శరీరంలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల బ్లడ్​ లో షుగర్ పెరుగుతుంది. ఈ డయాబెటిస్​ తో  ఇతర శారీరక సమస్యలొస్తాయి.

 టైప్ 2 డయాబెటిస్ సమస్య తగ్గదు.

జీవిత కాలం మందులు వాడాలి. ఈ వ్యాధి వస్తున్న దశలో మేల్కొంటే దాని నుంచి బయట పడొచ్చు. టైప్ 2 డయాబెటిస్ దీర్ఘకాలం శరీరంలో మార్పులు రావడం వల్ల వస్తుంది. ఆహారం, అలవాట్ల వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. ఇది రావడానికి పదేళ్ల ముందు నుంచే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ లక్షణాల ఆధారంగా టైప్ 2డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టొచ్చు. 

టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

 నోరు ఎండిపోవడం ఎక్కువగా ఆకలి వేయడం బాగా దప్పికవేయడం, తలనొప్పి, అప్రయత్నంగా బరువు తగ్గడం వెంట వెంటనే మూత్రం రావడం తరచుగా ఇన్ఫెక్షన్లతో బాధపడటం చిగుళ్ల సమస్యలు గాయాలు త్వరగా మానకపోవడం

కంటి చూపు

కంటి చూపు మసకగా కనిపిస్తుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే సూచనగా భావించవచ్చు. చూపు మసకబారడమే కాకుండా కంటిపై నల్లని మచ్చలు (చారలు) ఏర్పడినా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదముందని గుర్తించాలి.