అరేబియా మహా సముద్రం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అందులోనూ వాతావరణంపై.. ఎందుకంటే.. 50 ఏళ్లల్లో.. అందులోనూ ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటమే.. అవును..1976లో..ఆగస్ట్ నెలలో గుజరాత్ రాష్ట్రం కచ్ తీరంలో తుఫాన్ ఏర్పడింది. మళ్లీ 2024, ఆగస్ట్ 30వ తేదీన అదే ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. ఈసారి తుఫాన్ కు అస్నా అనే పేరు పెట్టారు.
ALSO READ | అంటార్కిటికా ఖండంపై వాతావరణ మార్పుల ప్రభావం
మరో విశేషం కూడా ఉంది. 1891 నుంచి 2023 మధ్య కాలంలో.. ఆగస్ట్ నెలలో.. అరేబియా సముద్రంలో కేవలం మూడు తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి.. 132 సంవత్సరాల్లో.. ఇది మూడోది మాత్రమే. ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుఫాన్ లు ఏర్పడవు.. వాతావరణం అనుకూలంగా ఉండదు.. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు తుఫాన్ ఏర్పడటం చూస్తుంటే.. వాతావరణంలోని మార్పుల వల్లే అంటున్నారు నిపుణులు.