బీర్పూర్​మండలంలో తుదిదశకు రోళ్లవాగు ప్రాజెక్ట్

  • ముంపు భూములపై పెండింగ్​లోనే ఫారెస్ట్​ ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ..
  • జగిత్యాల జిల్లాలోని ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 2వేలకు పైగా ఎకరాలు మునక 
  • ఇందులో ఫారెస్ట్ ల్యాండ్​864 ఎకరాలు
  • ఆ శాఖ ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ ఇస్తే టీఎంసీ సాగునీరు అందుబాటులోకి..
  • ఈసారీ తాత్కాలిక ఏర్పాట్లు చేశామంటున్న అధికారులు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా బీర్పూర్​మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్లు ఇంకా రాకపోవడంతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఈసారి రైతులకు పాతపద్ధతిలోనే 0.25 టీఎంసీల సాగునీరు అందించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కిందటిసారి భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల రోళ్లవాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ దెబ్బతినడంతోపాటు ఆయకట్టు పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్వోసీ వచ్చాక గేట్లు ఏర్పాటు చేసి రైతులకు ఒక టీఎంసీ సాగునీరు అందించే అవకాశం ఉంది. 

నత్తనడకన రోళ్లవాగు ప్రాజెక్టు

రోళ్లవాగు కింద బీర్పూర్, ధర్మపురి మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా ప్రాజెక్ట్ కెపాసిటీ 0.25టీఎంసీలే ఉండడంతో ఈ ఆయకట్టుకు సరిపడా నీరందని పరిస్థితి. దీంతో రోళ్లవాగును ఆధునీకరించి ఒక టీఎంసీకి పెంచాలని నాటి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. 2017లో రూ.60. 25 కోట్లతో పనులు ప్రారంభించింది. నిధుల విడుదలలో జాప్యంతో ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదు. పనులతో పాటు రిపేర్లు కూడా చేపట్టాల్సి రావడంతో అంచనా వ్యయం రూ.152కోట్లకు చేరింది. దీనికితోడు గతేడాది భారీ వరదలతో కట్టలు తెగి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో తీవ్రంగా నష్టం పోయారు. 

ప్రత్యామ్నాయంగా రెవెన్యూ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ కేటాయింపు

రోళ్లవాగు గుట్టల మధ్య ఉండడంతో వానాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటితో పాటు శ్రీరాంసాగర్ డీ-53, 12ఎల్, 1- ఆర్ కాలువ ద్వారా నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన పనుల్లో 1,240 మీటర్ల నిర్మాణం పూర్తి కాగా, 25 మీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు దిగువకు నీరు విడుదల చేసేందుకు 3 తూములకు గేట్లు బిగించాల్సి ఉంది. కాగా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ ఇవ్వకపోవడంతో ప్రాజెక్ట్ తుదిదశ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. తూములకు గేట్లు బిగిస్తే ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీరు చేరుతుంది.

కెపాసిటీ పెంపుతో ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు చెందిన 864 ఎకరాలు, రెవెన్యూ భూములు 900 ఎకరాలు, పట్టా భూములు 250 ఎకరాలు మునుగుతున్నాయి. ఇందులో రెవెన్యూ, పట్టా భూములకు క్లియరెన్స్ అయ్యాయి. మునుగుతున్న ఫారెస్ట్ భూములకు ప్రత్యామ్నాయంగా 864 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. దీనికోసం పెగడపల్లి మండలం నంచర్ల, దికొండ, ల్యాగలమర్రి, గొల్లపల్లి మండలం చందోళి గ్రామాల్లోని రెవెన్యూ భూములను పరిశీలిస్తున్నారు. భూములను గుర్తించి ఇరిగేషన్ డిపార్మెంట్ కు అప్పగించిన తర్వాత ఫారెస్ట్ డిపార్మెంటుకు కేటాయిస్తే అనుమతులు మంజూరు కానున్నాయి. ఈ విషయం సర్కార్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్ డిపార్మెంట్ ఆఫీసర్లు తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

సాగునీటికి తాత్కాలిక ఏర్పాట్లు

ప్రస్తుతం రోళ్లవాగు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ వానాకాలంలో దాదాపు 2వేల ఎకరాలకు 0.25 టీఎంసీల సాగునీరిచ్చేందుకు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేశాం. ఫారెస్ట్ డిపార్మెంట్ నుంచి అనుమతులు రాగానే పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను వినియోగంలోకి తీసుకొస్తాం. 

చక్రునాయక్, డీఈఈ, రోళ్లవాగు