ప్రాచీన కట్టడాలను రక్షించాలి : కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్ ​పేర్కొన్నారు. రాజంపేట మండల కేంద్రంలోని పురాతన బావిని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దాతల సహకారంతో బావిని బాగు చేయిస్తామన్నారు. పూడిక తీస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశముందన్నారు. శ్రమదానం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, మహిళాసంఘాల ప్రతినిధులు, స్థానికులు ముందుకు రావాలన్నారు. 

గర్భిణుల్లో రక్తహీనత సమస్య రాకుండా చూడాలి

గర్భిణుల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ​జితేశ్​వీ పాటిల్ ఆదేశించారు. డాక్టర్లు, ఆఫీసర్లతో శుక్రవారం నిర్వహించిన జూమ్​ మీటింగ్​లో మాట్లాడారు. రక్తహీనతతో గర్భిణులు ఇబ్బందులు పడితే హెల్త్ స్టాఫ్​పై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నెల 3న నిర్వహించే పల్స్​పోలియో కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలన్నారు. డీఎంహెచ్​వో  డాక్టర్ ​లక్ష్మణ్​సింగ్, డిప్యూటీ డీఎంహెచ్​వోలు చంద్రశేఖర్, శోభారాణి పాల్గొన్నారు.