సీఎం, జిల్లా మంత్రులకు ధన్యవాదాలు

నల్గొండ అర్బన్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు కలిశారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే దిండి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర క్యాబినెట్ రూ.1800 కోట్లు కేటాయించి ఏదుల నుంచి నీరు తీసుకునేందుకు రాష్ర్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్​లో సీఎం, జిల్లా మంత్రులు, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే బాలూనాయక్ ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు, ఫ్లోరైడ్ తో సతమతమవుతున్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దాలుగా సీపీఐ అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.  ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారానికి సాగునీరే ఏకైక మార్గమన్నారు. సీఎం, మంత్రులను కలిసి వారిలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లె వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే వి.యాదగిరిరావు ఉన్నారు.