సమంత సిటాడెల్ ఎలా ఉందంటే.?

టైటిల్ : సిటడెల్‌: హనీ బన్నీ

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

డైరెక్షన్ : రాజ్‌ అండ్‌ డీకే

కాస్ట్ : వరుణ్‌ ధావన్‌, సమంత, కేకే మేనన్‌, సికందర్‌ ఖేర్‌, సిమ్రన్‌, షకీబ్‌ సలీమ్‌

లాంగ్వేజ్: హిందీ, తెలుగు

హనీ (సమంత) నైనిటాల్‌లోని ఒక కాఫీ షాప్‌లో పని చేస్తుంటుంది. ఆమెకు నాడియా (కష్వీ​) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. ఒక రోజు సరుకుల కోసం వెళ్లిన హనీని ఒక వ్యక్తి ఫాలో అవుతుంటాడు. అది గమనించిన హనీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. కానీ..  దొరికిపోతుంది. ఆ తర్వాత వాళ్ల బందీ నుంచి తప్పించుకుని తన కూతురు దగ్గరకు వెళ్తుంది. కూతురితోపాటు అక్కడినుంచి వేరే చోటికి వెళ్తుంది. 

కొందరు వ్యక్తులు ఆమె ఉన్న ప్లేస్​ తెలుసుకుని వెంబడిస్తారు. మరోవైపు చనిపోయింది అనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం విదేశాల్లో ఉన్న బన్నీ (వరుణ్‌ ధావన్‌)కి తెలుస్తుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. ఒకవైపు సిటాడెల్​ టీం, మరోవైపు ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ లీడర్​ గురు (కేకే మేనన్‌) ‘అర్మార్డ్‌’ అనే వస్తువును వెతుకుతుంటారు. ఆర్మార్డ్​కి హనీకి ఉన్న సంబంధం ఏంటి? హనీ వాళ్ల నుంచి తప్పించుకుందా? లేదా? తెలియాలంటే ఈ వెబ్​సిరీస్​ చూడాల్సిందే.